
చెన్నూరు: పెద్దపెల్లి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందుతారని చెన్నూరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం ఎంపీ ఎలక్షన్లఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వంశీ గెలుపు కోసం సోమవారం వంచెన్నూరులోని అంబా అగస్తేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ఐత హిమవంత రెడ్డి –శకుంతల దంపతుల ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు పూజలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కాకా కుటుంబం ప్రజలకు ఎనలేని సేవాలందించిందన్నారు.
వారి సేవలను గుర్తుంచుకొని వంశీని ప్రజలు ఓటు రూపంలో ఆశీర్వదించారన్నారు.మంగళవారం జరుగబోయే కౌంటింగ్ లో వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వంశీకి శివుని అనుగ్రహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, బుర్ర కృష్ణ, జాడి రాజేందర్, చింతల శ్రీనివాస్, కమలాకర్, రామ్ గోపాల్ రెడ్డి, తుమ్మ రఘునందన్ రెడ్డి, సమ్మిరెడ్డి, పాతర్ల నాగరాజు, చెన్న వెంకటేశ్, మహేశ్, తిరుపతి, బొందయ్య, మధు, రోహన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.