గౌడ్ల కోసమే టీఆర్ఎస్​లో చేరిన : స్వామి గౌడ్​

గౌడ్ల కోసమే టీఆర్ఎస్​లో చేరిన : స్వామి గౌడ్​
  • గౌడ్ల కోసమే టీఆర్ఎస్​లో చేరిన
  • శాసనమండలి మాజీ చైర్మన్​ స్వామి గౌడ్​

చండూరు, వెలుగు: గౌడ్లకు బీజేపీలో న్యాయం జరగదనే తాను టీఆర్ఎస్ లో చేరినట్లు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ చెప్పారు. మంగళవారం చండూరులో టీఆర్ఎస్​లోని గౌడ కులస్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​కు కల్లు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, గౌడ కులస్థులకు వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్​ను కోరినట్లు చెప్పారు.

కల్లుగీత కార్మికులకు వాహనాలు అందజేయాలని కోరగా మంత్రి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ రూ.18 వేల కోట్లతో రాజగోపాల్​రెడ్డిని కొనుగోలు చేసిందని టీఆర్ఎస్​లీడర్​బూడిద భిక్షమయ్య గౌడ్​ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, తెలంగాణ గౌడ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.