ఉద్యోగార్థుల కోసం.. కరెంట్ టాపిక్

ఉద్యోగార్థుల కోసం.. కరెంట్ టాపిక్
  • తెలంగాణ హిస్టరీ సొసైటీ 2006, జూన్​ 6న ఆవిర్భవించింది. 
  • తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్​గా టి.వివేక్​ నియమితులయ్యారు. 
  • హైదరాబాద్​లోని ఫతే మైదాన్​ క్లబ్​లో  తెలంగాణ హిస్టరీ సొసైటీ జరిపిన సన్నాహక సమావేశానికి జి.వెంకట రామారావు, దేవులపల్లి అజయ్​, ఎన్​.వేణుగోపాల్​, సంగిశెట్టి శ్రీనివాస్​, కె.జితేంద్రబాబు, మలయశ్రీ, పి.లోకేశ్వర్​, డి.పాండురంగారెడ్డి, టి.వివేక్, శ్రీధర్​రావు దేశ్​పాండే, హరినాథ్​, రాపోలు ఆనందభాస్కర్​, ఘంటా చక్రపాణి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సోమన్న, తిప్పరెడ్డి, సుభద్ర, స్కైబాబా, కె.మధుసూదనరెడ్డి తదితరులు హాజరయ్యారు. 
  •  తెలంగాణ హిస్టరీ సొసైటీ లక్ష్యాలు, ఆశయాలు 1. తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి, 2. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడం, 3. తెలంగాణ ప్రాంతంలోని స్థానిక చరిత్రను లిఖించడం.
  • తెలంగాణ  హిస్టరీ సొసైటీ 1. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం, 2. సెప్టెంబర్ 17, 1948 భిన్న దృక్కోణాలు 3. 1857 పోరాట తిరుగుబాటు, 4. ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు విద్రోహ చరిత్ర పుస్తకాలను ప్రచురించింది. 
  • తెలంగాణ జన పరిషత్​ను కేశవరావు జాదవ్​ స్థాపించారు. 
  • తెలంగాణ జనపరిషత్​లో 19 భాగస్వామ్య సంస్థలున్నాయి.
  • తెలంగాణ జనపరిషత్​ 2006లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో భాగస్వామ్య సంస్థగా చేరింది. 
  • తెలంగాణ శక్తుల ఏకీకరణ కోసం తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ 2006 ఆగస్టులో ఆవిర్భవించింది. 
  • తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ స్థాపనలో పాశం యాదగిరి, హన్మండ్లు, చిక్కుడు ప్రభాకర్​, ఆకుల భూమయ్య కీలక పాత్ర పోషించారు. 
  • ఐక్య కార్యాచరణ కమిటీలో 32  ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు భాగస్వామ్య సంస్థలు అయ్యాయి. 
  • తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జనపరిషత్​, తెలంగాణ జనసభ, తెలంగాణ రైతాంగ సమితి, తెలంగాణ ప్రజాకళా మండలి, కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ స్టూడెంట్స్​ ఆర్గనైజేషన్​, తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ ఐటీ ఫోరం చేరాయి. 
  • భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అన్న నినాదంతో తెలంగాణ సంఘర్షణ సమితి ఆవిర్భవించింది.
  • తెలంగాణ సంఘర్షణ సమితిని బెల్లయ్యనాయక్​ స్థాపించారు. 
  • తెలంగాణ సంఘర్షణ సమితి 2006 సెప్టెంబర్​ 28న ఏర్పాటైంది. 
  • పీపుల్స్​ తెలంగాణ ఫౌండేషన్​ 2007, మేలో ఏర్పడింది. 
  • పీపుల్స్​ తెలంగాణ ఫౌండేషన్​ స్థాపనలో క్రియాశీలకమైన భూమిక పోషించిన వారిలో ఎస్​.సింహాద్రి, వై. తిరుమల, ఎస్​.మల్లేష్, భాంగ్యాభుక్యా, ఎ.సత్యనారాయణ, మురళీమనోహర్​, ఎం.వెంకటదాసు, డి. రవీందర్, ఎం.చెన్నబసవయ్య, పి.ఎల్​.వి.విశ్వేశ్వరరావు, జి.వినోద్​కుమార్​, జి.మల్లేశం, కె.బి.వెంకటరమణ, ఎస్​.రామనాథం, ఆర్​.అఖిలేశ్వరి తదితరులు హాజరయ్యారు. 
  • తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్​ ఓయూలో 2008 మార్చి 1న ఆవిర్భవించింది. 
  • తెలంగాణ హిస్టరీ​ కాంగ్రెస్​ అధ్యక్షులుగా ప్రొ.జి.వెంకటరాజన్​ నియమితులయ్యారు. 
  • తెలంగాణ సెటిలర్స్​ ఫ్రంట్​ కె.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైంది. 
  • తెలంగాణ సెటిలర్స్​ ఫ్రంట్​ 2008 అక్టోబర్ 18న ఏర్పాటైంది.
  • తెలంగాణ సెటిలర్స్​ ఫ్రంట్​ 2009 ఫిబ్రవరి 1న నిజాం కాలేజ్​ గ్రౌండ్స్​లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 
  • తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక ఉస్మానియా యూనివర్సిటీలో 2008 నవంబర్​ 26న ఏర్పాటైంది. 
  • తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక  ఏర్పాటుకు ప్రొ.రమేశ్​రెడ్డి, ప్రొ.కోదండరాం, ప్రొ.మానస చెన్నప్ప కృషి వల్ల ఏర్పడింది. 
  • తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదికకు అధ్యక్షునిగా ఆర్​.రమేశ్​రెడ్డి ఎన్నికయ్యారు.