జర్నలిస్టులకు ఎక్స్ సోషల్ మీడియా సంస్థ ఓనర్ ఎలన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. ఆదాయం గురించి ఆలోచించే జర్నలిస్టులు తమ స్టోరీలను నేరుగా ఎక్స్ మీడియా అకౌంట్‌లో పబ్లిష్ చేయాలని కోరారు. అలాంటి జర్నలిస్టులకు అధిక స్థాయిలో ఆదాయం ఉంటుందని, మరింత స్వేచ్ఛతో కథలు రాసుకోవచ్చునన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.మీరు వ్రాయడానికి మరింత స్వేచ్ఛ, అధిక ఆదాయాన్ని కోరుకునే జర్నలిస్టు అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లో నేరుగా ప్రచురించండి... అని పోస్ట్ చేశారు.
ALSO READ : ఆసియా కప్ టీమ్‌లో..తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ
మీడియా పబ్లిషర్స్‌కు కూడా మస్క్ ఇటీవల ఓ ప్లాన్ ప్రకటించారు. కథనాలను పబ్లిష్ చేసే సంస్థలు.. వాటిని చదివే యూజర్ల నుంచి ఛార్జీలు వసూల్ చేయాలని ఆయన సూచించారు. వార్తా కథనాల ఆధారంగా యూజర్ల నుంచి ఛార్జీలను వసూల్ చేయాలని, ఒకవేళ యూజర్లు సైనప్ చేయకుంటే, వారి నుంచి మరింత అధికంగా ఛార్జీ వసూల్ చేయాలని మస్క్ సూచించారు.