ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లులో కొత్తదందా స్టార్ట్ చేశారు. హోటల్ ఫ్రీగా లూస్ వాటర్ ఇవ్వకుండా.. సీల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నారు. ఇంకా ఆ వాటర్ బాటిల్ కి కూడా బిల్ వేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ మున్పిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అన్ని హోటల్ మరియు రెస్టారెంట్లలో ఉచితంగా వాటర్ సప్లై చేయాలని 2023 నుంచి నిబంధనలు జారీ చేసింది. అయినప్పటికీ చాలా హోటళ్లు ఆర్డర్ చేసిన ఫుడ్ తోపాటు నీళ్లకు కూడా బిల్ వేస్తున్నారు. ఇదే విధంగా ఆఫ్ లీటర్ వాటర్ కు రూ.50 ఛార్జ్ చేసినందుకు ఓ కస్టమర్ డిస్ట్రిక్ కన్సూమర్స్ కమిషన్ కు ఆశ్రయించాడు. ఆ హాటల్ కస్టమర్‌కు రూ.5వేల చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఫైన్ వేసింది.
సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. తనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నీళ్లు వద్దని, లూస్ వాటర్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరాడు. అయినా హోటల్‌లో 500 ml వాటర్ బాటిల్ ఇచ్చి రూ.50 ఛార్జ్ చేశారు. అందుకు ఆయన కన్సూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. కస్టమర్‌కు కలిగిన నష్టానికి రూ.5వేలు చెల్లించాలని, లిటిగేషన్ ఫీజు రూ.వేయి కట్టాలని దీంతోపాటు వాటర్ బాటిల్ కు తీసుకున్న రూ.50 కస్టమర్ కు తిరిగి ఇచ్చేయాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.