తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న ఉదయం 7.28 గంటలకు పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. అయితే తెలంగాణలో గత 20 ఏళ్లలో తొలిసారిగా అత్యంత తీవ్రతతో భూకంపం సంభవించింది. జనం ఒక్కసారిగి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది పలు చోట్ల రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. . హైదరాబాద్ లోని బంజారహిల్స్, జూబ్లీహిల్ల్ లోనూ భూమి కంపించింది. జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కి.మీ లనుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు.
For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.
— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024
Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ
వరంగల్ జిల్లా నర్సంపేట, ఏటూరు నాగారంలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం7.28 నిమిషాలకు 3 సెకండ్ల పాటు కంపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇల్లందులో స్వల్పంగా భూమి కంపించింది. మణుగూరు అశ్వాపురం మండలాల్లో ఆరు సెకండ్ల పాటు కంపించింది. ఖమ్మం నగరంతో , కామేపల్లి , కారేపల్లి మండలంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇండ్లల్లో వైబ్రేషన్ రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు.