రాజస్థాన్‌ హైకోర్టులో జడ్జీలుగా భార్యాభర్తలు

రాజస్థాన్‌ హైకోర్టులో జడ్జీలుగా భార్యాభర్తలు

రాజస్థాన్‌ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్‌ మహేంద్ర గోయల్‌ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయన సతీమణి జస్టిస్‌ శుభా మెహతా కూడా అదే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

కేంద్ర న్యాయశాఖ జస్టిస్ కుల్దీప్​ మథూర్​, జస్టిస్​ శుభా మెహతాను రాజస్థాన్ హైకోర్టు జడ్జీలుగా నియమించింది. అయితే జస్టిస్​ శుభా మెహతా భర్త జస్టిస్​ మహేంద్ర గోయల్​ ఇప్పటికే  రాజస్థాన్ హైకోర్టులో జడ్జీగా ఉన్నారు. దీంతో ఇకపై ఇద్దరు ఒకే కోర్టులో న్యాయమూర్తులుగా ఉండనున్నారు. కొత్తగా నియమించిన ఇద్దరు జడ్జీలతో కలిపి రాజస్థాన్​ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య 25 నుంచి 27కు పెరిగింది. మొత్తం జడ్జీల సంఖ్య 50 కాగా.. ఇంకా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

2020 డిసెంబర్​లో మద్రాసు హైకోర్టులోనూ జస్టిస్ మురళీశంకర్ కొప్పురాజుతో పాటు ఆయన భార్య జస్టిస్​ తమిళ్​సెల్వి టీ వలయపాలయమాండ్ ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2019 నవంబర్​లోనూ పంజాబ్​ హైకోర్టు జడ్జీలుగా జస్టిస్ వివేక్​ పూరి, ఆయన సతీమణి జస్టిస్​ అర్చన పూరి ఒకే రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు రాజస్థాన్​లోనూ భార్యాభర్తలు జడ్జీలుగా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

జూబ్లిహిల్స్ పబ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్