తొలి సారి డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు

2021-22 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  జనభా లెక్కలకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు.  రానున్న జనాభా లెక్కలు డిజిటల్ పద్ధతిలో జరగనున్నాయన్నారు. జనాభా లెక్కలకు రూ.3768 కోట్లు కేటాయించారు. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారి జనాభా లెక్కలు డిజిటల్ పద్ధతిలో జరగనున్నాయి.

ముఖ్యాంశాలు

బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం.

హెల్త్ కేర్ రంగం కోసం రూ. 2,23,846 కోట్లు

కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు కేటాయించారు.

అర్బన్ స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం రూ. 1,41,678 కోట్లు

మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్స్ పార్కులను అభివృద్ధి చేస్తాం.

రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు

ఇకపై వెహికల్స్ లైఫ్ టైమ్ 20 ఏళ్లే