యాదాద్రి(బీబీనగర్), వెలుగు : కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్కు చెందిన బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీతతోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదింపులు చేసిన తర్వాతే ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు గౌరవం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చేరికలు ప్రారంభం కాలేదన్నారు. పార్లమెంట్ఎన్నికలతోపాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అనిల్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సురకంటి సత్తిరెడ్డి, గోలి నరేందర్ రెడ్డి, పటోల్ల శ్యాంగౌడ్, పెంటయ్య, బాలకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.