కిర్గిస్థాన్‌లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు

గతకొద్ది రోజులుగా  కిర్గిస్థాన్ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడి విదేశీ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని హాస్టల్స్ పై దాడులు చేస్తున్నారు స్థానికులు. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణ వీడియోలు శుక్రవారం వైరల్‌ కావడంతో ఈ పరిస్థితులకు దారి తీసింది. అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని మెడికల్ యూనివర్సటీ హాస్టళ్లపై దాడి స్థానికులు మూక దాడులు చేస్తున్నారు. ఈ దాడిల్లో పాకిస్థాన్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కిర్గిస్థాన్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ను అలర్ట్ చేసింది. విద్యార్థులు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.  ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు 24 గంటలపాటూ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్‌ 0555710041ను షేర్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. కిర్గిస్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు. అలాగే పాకిస్థాన్ కూడా వాళ్ల స్టూడెంట్స్ కు జాగ్రత్తలు చెప్పింది. పాకిస్థాన్ స్టూడెంట్స్ కూడా కిర్గిస్థాన్ లో 10వేల మంది ఉన్నారని తెలుస్తోంది.