సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో శామ్యూల్ మాథ్యూ నిర్మించిన చిత్రం ‘మిస్ యు’. నవంబర్ 29న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. శనివారం హీరో కార్తి ట్రైలర్‌ను రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ట్రైలర్ విషయానికొస్తే.. డైరెక్టర్ కావాలని కల కంటుంటాడు సిద్ధార్థ్. వాసుగా సిద్ధార్థ్, సుబ్బలక్ష్మిగా ఆషికా రంగనాథ్ పాత్రలను పరిచయం చేశారు.
వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఎందుకు గొడవ పడతారనేది ఆసక్తికరంగా చూపించారు. ‘మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు..’ అని సిద్ధార్థ్ చెప్పిన డైలాగ్‌తో పాటు జీబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. కరుణాకరన్, బాలశరవణన్, మారన్ ఇతర పాత్రలు పోషించారు.