2024కుగాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి చోటు దక్కించుకున్నారు.
మొదటి స్థానంలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్, రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా నిలిచారు. ఈ జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. 28 స్థానంలో నిర్మలా సీతారామన్ 81వ స్థానంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్, 82వ స్థానంలో బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ 2009లో 34, 2020లో 41, 2021లో 37, 2022లో 36, 2023లో 32, 2024లో 28వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రతి ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయం, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రతిభావంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తుంది.