ఉప్పల్ లో బలవంతపు పెళ్లి..వీడియో వైరల్

ఉప్పల్ లో బలవంతపు పెళ్లి..వీడియో వైరల్

ప్రేమించి మోసం చేశాడంటూ పెళ్లయిపోయిన యువకుడికి ప్రియురాలితో మళ్లీ పెళ్లి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. యువకుడిని వెతికి తీసుకొచ్చి బలవంతంగా ప్రియురాలికి తాళి కట్టించారు. ఈ ఘటన హైదరాబాద్ రామాంతపూర్ లో జరిగింది. శ్రీకాంత్ అనే యువకుడికి గతంలో వివాహాం అయింది. అయితే పెళ్లికి ముందు శ్రీకాంత్ వేరే యువతిని ప్రేమించాడు. కానీ ప్రేమించిన యువతిని కాదని ఇంట్లో వాళ్లు చూపించిన సంబంధం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ జాడ తెలుసుకొని చితకబాదారు. తర్వాత ప్రియురాలితో పెళ్లి చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ కు బలవంతంగా పెళ్లి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు పీఎస్ లో కంప్లైంట్ చేశారు.

 

పేరు మార్చుకున్న టర్కీ

బాలి ఫొటోగ్రాఫర్ సాహసం