చెన్నైలో ఉన్న ఫోర్డ్ కార్ల తయారీ ప్లాంట్ ను అమ్మకాన్ని వాయిదా వేసింది. ఇటీవల JSW కంపెనీకి తన చైన్నె ప్లాంట్ ను అమ్మేందుకు సిద్ధమైన ఈ అమెరికన్ ఆటో దిగ్గజం భారత్ లో వ్యాపార నిష్క్రమణపై పునరాలోచించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటో మార్కెట్లలో ఒకటైన భారత్ ను ఫోర్డ్ కార్ల కంపెనీ వదులుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
చెన్నైలో ఫోర్డ్ కార్ల తయారీకి ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు ఆ కంపెనీ ఇండియా ప్రతినిధి చెప్పారు. చెన్నైలో 350 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫోర్డ్ కార్ల కంపెనీ.. 2022 జూలై నుంచి తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ కంపెనీ సంవత్సరానికి లక్షా 50 వేల కార్లు,3లక్షల 40 వేల ఇంజన్లను ఉత్పత్తి చేసేది.
మహీంద్రా అండ్ మహీంద్రా తో జాయింట్ వెంచర్ తో భారత్ లో కి ప్రవేశించిన ఈ యూఎస్ ఆటో దిగ్గజం..10 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూసింది.2021 నుంచి ఫోర్డ్ ఇండియా సర్వీస్ నెట్ వర్క్ వ్యాపారాలపై మాత్రమే దృష్టి సారించింది. ఆటోమోటివ్ విడి భాగాల దిగుమతి, సరఫరా మాత్రమే చేసింది.
అయితే మరోవైపు ఈ యూఎస్ కార్ల తయారీ సంస్థ చెన్నై ప్లాంట్ ను విక్రయించేందుకు వియత్నాం మీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ దారు కంపెనీలో కూడా చర్చలు జరుపుతోంది.