పెరుగుతున్న ఎఫ్​ఐఐల పెట్టుబడులు

పెరుగుతున్న ఎఫ్​ఐఐల పెట్టుబడులు

న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) వరుసగా ఎనిమిదో సెషన్‌‌లోనూ షేర్లను భారీగా  కొన్నారు. గురువారం ఒక్క రోజే రూ.8,250 కోట్లు ఇన్వెస్ట్​ చేశారు.  ఈ ఏడాది మార్చి 27 తర్వాత అతిపెద్ద సింగిల్ డే కొనుగోలు ఇదే.  దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీ​ఐఐలు) మాత్రం లాభాలను బుక్ చేసుకున్నారు, రూ.534 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌‌లోడ్ చేశారు. 

గురువారం ట్రేడింగ్ సెషన్‌‌లో, ఎఫ్​ఐఐలు రూ.24,089 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి, రూ.15,838 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.13,452 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి, రూ.13,986 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు, ఎఫ్​ఐఐలు రూ.1.45 లక్షల కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మగా, డీ​ఐఐలు రూ.1.97 లక్షల కోట్ల విలువైన షేర్లను కొన్నారు.