ఆర్మీ క్యాంటీన్స్‌లో దిగుమతి చేసుకున్న వస్తువులను అమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం ఆర్మీ షాపులను ఆదేశించింది. నిషేధించిన జాబితాలోకి విదేశీ మద్యం బాటిల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి దిగుమతి వస్తువులను కొనకూడదని దేశంలోని 4 వేల ఆర్మీ షాపులను కేంద్రం ఆదేశించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 19న రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.
ఆర్మీ క్యాంటీన్ల ద్వారా మద్యం, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వస్తువులను సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రాయితీ ధరలకు అందిస్తారు. సంవత్సరానికి రెండు బిలియన్లకు పైగా అమ్మకాలతో ఆర్మీ క్యాంటీన్లు అతిపెద్ద రిటైల్ అమ్మకందారులుగా నిలిచాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం… డియాజియో మరియు పెర్నోడ్ రికార్డ్ వంటి విదేశీ మందును విక్రయించరని తెలుస్తోంది.
మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక దళం, నావికాదళంతో చర్చించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఈ విషయంపై స్పందించడానికి మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు. అయితే ఏ ఉత్పత్తులను అమ్మకూడదో ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం గమనార్హం.
ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ (ఐడీఎస్ఏ) యొక్క పరిశోధన ప్రకారం.. ఆర్మీ క్యాంటీన్లలో అమ్మే వస్తువులలో దాదాపు 6-7% వస్తువులు దిగుమతి చేసుకున్నవే. వాటిలో చైనీస్ ఉత్పత్తులైన డైపర్స్, వాక్యూమ్ క్లీనర్స్, హ్యాండ్‌బ్యాగులు మరియు ల్యాప్‌టాప్‌లు ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయని ఐడీఎస్ఏ తెలిపింది.
అయితే డిఫెన్స్ స్టోర్లలో అమ్మే దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆర్మీ క్యాంటీన్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ నిర్ణయం ప్రతికూల సంకేతాన్ని పంపుతుందని ఆయన అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం.. ఇలా విదేశీ అమ్మకాలను ఎందుకు నిషేధిస్తుందని ఆయన అన్నారు.
For More News..