శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేటలో కానుగంటి సదానందంకు చెందిన ఆయిల్‌పామ్ తోటను గురువారం మలేషియా, ఫ్రాన్స్, ఇండోనేషియాకు చెందిన సైంటిస్ట్‌లు పరిశీలించారు. రైనోసరస్ బీటిల్స్ (కొమ్ము పురుగు) తో జాగ్రత్తగా ఉండాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. కొమ్ముపురుగు నివారణ, సంతానోత్పత్తి ప్రదేశాలు, వాటి మూలాల నియంత్రణకు మోటారో హైజమ్ వినియోగించాలన్నారు.
అలాగే 30 నెలల వరకు గెలలను ఎప్పటికప్పుడు తొలగించాలని, లేకపోతే దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయన్నారు. మొక్క ఆకు ఎంత దూరం ఉంటుందో అంతవ రకు భూమిని దున్నకూడదన్నారు. మలేషియాకు చెందిన నికోలస్, ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్ లారెన్స్, ఇండోనేషియాకు చెందిన విజయన్‌తో పాటు మన దేశానికి చెందిన సాంకేతిక సలహాదారు రంగనాయకులు, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ్, నర్సరీ అసిస్టెంట్ మేనేజర్ చాణక్య.. ఆయిల్ పామ్ తోటను పరిశీలించిన వారిలో ఉన్నారు.
ALSO READ: మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌కు నిరసన సెగ