జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జైనూర్ మండలంలో మంగళవారం విదేశీయులు సందడి చేశారు. ప్రగతి చేతన ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న సేంద్రియ వ్యవసాయాన్ని పరిశీలించేందుకు విదేశీ ప్రతినిధుల బృందం జైనూర్ కు చేరుకుంది. శేకుగుడా గ్రామంలోని ఓ ఆదివాసీ రైతు చేనులో కాసేపు పత్తి ఏరారు. దగ్గర్లోని పత్తి చేన్లను పరిశీలించారు. రాసిమెట్ట గ్రామంలో రైతులను సాగు పద్ధతులు అడిగి తెలుసుకున్నారు.
రసాయానిక వ్యవసాయాన్ని వీడి ఆర్గానిక్ సాగుపై రైతులను ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని చేతన ఆర్గానిక్ సంస్థ సీఈవో నందకుమార్ వివరించారు. ఆర్గానిక్ సంస్థ ప్రతినిధులు శ్రీరంగరాజన్, వివిత్ శుభ్రమన్యం, జనరల్ మేనేజర్ దాసండ్ల ప్రభాకర్ తదితరులున్నారు.