సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్న ఫోరెన్సిక్ టీమ్

మైనర్ పై అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే సీజ్ చేసిన బెంజ్ కార్ ను క్లూస్ టీం పరిశీలిస్తోంది. కారు లోపల తనిఖీలు చేశారు ఫోరెన్సిక్ టీమ్ ఆఫీసర్లు. బెంజ్ కార్లోనే మైనర్ పై అఘాయిత్యం జరిగినట్టు ఫోటోలు బయటకొచ్చాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తోంది ఫోరెన్సిక్ బృందం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక కాళీ ప్రదేశంలో కారును ఉంచారు పోలీసులు. మైనర్ గర్ల్ కు చెందిన చెప్పులు, ఇయర్ రింగ్స్, వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఫోరెన్సిక్ నిపుణులు.