- అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి డోబ్రియల్
హైదరాబాద్, వెలుగు: అటవీ ప్రమాదాల్లో ఎక్కువగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని తెలంగాణ అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి ఆర్ఎం. డోబ్రియాల్ అన్నారు. అటవీ ప్రమాదాల నివారణ పరికరాలు, చర్యలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ అనే అంశాలపై వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో రెండ్రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ను గురువారం హైదరాబాద్లోని ప్రైవేటు హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఐజీ రాజేష్ మాట్లాడుతూ.. గతేడాది ఉత్తరాఖండ్లో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ నరేంద్ర సింగ్ బుందేల్ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అగ్నిప్రమాద చర్యల్లో భాగం అయ్యేందుకు అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ అటవీ శాఖ అధికారి మాధవరావు రాసిన ‘ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ తెలంగాణ’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిం చారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ అడ్మిన్ సునీత భగవత్, ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.