పోడుభూమికి పట్టా చేయిస్తానని ఓ రైతును రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిరాములు అనే వ్యక్తికి అటవీ శాఖ భూమి పక్కనే సాగు భూమి ఉంది. అయితే గ్రామస్తులు రాకపోకల కోసం సిద్ధి రాములు భూమితో పాటు అటవీ శాఖ భూమి మీదుగా కల్వర్టును నిర్మించేందుకు ప్రయత్నించారు.
దీంతో సిద్ధి రాములు కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ సమస్యను పరిష్కారించాలంటే తనకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రూ. 20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.