పస్రా చెక్​ పోస్టు దగ్గర నాలుగు ఇసుక లారీలు సీజ్ చేసిన అటవీ అధికారులు

పస్రా చెక్​ పోస్టు దగ్గర నాలుగు ఇసుక లారీలు సీజ్ చేసిన అటవీ అధికారులు

ములుగు, వెలుగు: సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను అటవీ శాఖ అధికారులు సీజ్​ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా రేంజ్​పరిధిలోని చెక్​ పోస్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఇసుకతో వెళ్తున్న లారీలను ఆపి తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఆదినారాయణ ఆధ్వర్యంలో బీట్ అధికారులు, సిబ్బంది లారీలను స్వాధీనం చేసుకొని రేంజ్​ఆఫీస్​కు తరలించారు. 

ప్రభుత్వ అనుమతి మేరకు మాత్రమే ఇసుక తరలింపు చేపట్టాలని, సరైన పత్రాలు లేకుంటే వాహనాలు సీజ్​చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ చేపట్టినట్లు తెలిపారు.