
అమ్రాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. దోమలపెంట గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం -– హైదరాబాద్ రోడ్డుకు కుడివైపున ఫారెస్ట్‌కు అంటుకున్న మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా వందలాది హెక్టార్ల అడవి ధ్వంసమైంది.