
పలిమెల, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవిలో కార్చిచ్చు రేగింది. పలిమెల మండల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్‌ను మంటలు చుట్టుముట్టాయి. మంటలను ఆర్పేందుకు సమీపంలో ఫైర్ స్టేషన్ కూడా లేదు. 100 కిలోమీటర్ల దూరంలోని మంథని లేదా భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ రావాల్సి ఉంది. కొంతకాలంగా అడవిలో కార్ చిచ్చు రేగుతోంది. అడవిలోని మొక్కలు, జంతువులు అగ్నికి ఆహుతి అవుతుండగా.. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం .
కాగా ఇటీవలే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో 5 మండలాలకు ఫైర్ స్టేషన్ మంజూరు కాగా.. ఇంకా స్టేషన్ ఏర్పాటు చేయలేదు. ఎన్నో ఏండ్లుగా .. ఫైర్ స్టేషన్ లేదని.. ఇప్పటికైనా త్వరగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.