సింగరేణి కీలక నిర్ణయం: అటవీ భూముల్లో బొగ్గును తవ్వుతాం.. జీఎం జాన్

సింగరేణి కీలక నిర్ణయం: అటవీ భూముల్లో బొగ్గును తవ్వుతాం..  జీఎం జాన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఇల్లందు సింగరేణి ఏరియాలో జేకే 5 ఓసీ గనుల నుంచి బొగ్గు తీసేందుకు కాలపరిమితి ముగిసింది.   దీంతో 21 వ ఇంక్లైన్ భూగర్భగనిని కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయంలో  కేంద్ర పర్యావరణ మరియు వాతావరణ శాఖల నుంచి అనుమతులు వచ్చాయని జీఎం జాన్ ఆనంద్ తెలిపారు.  

Also Read :- మూసీ నిర్వాసితులకు వడ్డీలేని రుణాలు

 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  బొగ్గును తీసేందుకు ఉపరితల గనిని ఏర్పాటు చేసేందుకు అటవీ భూమిని ఉపయోగించుకుంటామని తెలిపారు.  151.85 హెక్టార్ల భూమికి అటవీశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.  దీంతో మరో 12 సంవత్సరాలు బొగ్గును ఉత్పత్తి చేస్తామన్నారు.  3,4 నెలల్లో స్టేజ్ 1 కు సంబంధించిన పనులు పూర్తవుతాయని జీఎం తెలిపారు.