సంగారెడ్డి (హత్నూర), వెలుగు: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులోని పలుగుమీది పోచమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో కొంత మంది అటవీ శాఖ పరిధిలోని భూమిని ఆక్రమించి షెడ్లు వేసుకున్నారు. ఈ విషయం గురించి పలు పత్రికల్లో వార్తలు రావడంతో అటవీ శాఖ అధికారులు షెడ్లను తొలగించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.
అయినప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోకపోవడంతో రాత్రి భారీ యంత్రాలతో రేకుల షెడ్లను కూల్చివేశారు. ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్ షాహిని హెచ్చరించారు.