- 8 మందిపై కేసు ఫైల్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
మహాముత్తారం, వెలుగు : మండలంలోని పెగడపల్లి రేంజ్ పరిధిలో ఉన్న రిజర్వ్ఫారెస్ట్లో అక్రమంగా చొరబడిన కొందరు పెద్ద పెద్ద చెట్లని నరికివేశారు. మేడారం మెయిన్ రోడ్డు పక్కనే జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెగడపల్లికి చెందిన కొందరు వ్యక్తులు గొత్తికోయ గిరిజనులను పిలిచి అడవిని నరికించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేంజ్ ఆఫీసర్ స్వాతిని వివరణ కోరగా.. అడవిలో చెట్లు నరికిన 8 మందిని గుర్తించామని, కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.