
- నలుగురిపై కేసు నమోదు
లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం బోనాల్ అడవిలో చెట్ల నరికివేతపై ఫారెస్టు ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. సోమవారం వెలుగు దినపత్రికలో 'ఆగనిచెట్ల నరికివే తలు'అనే శీర్షికన ప్రచు రితమైన వార్తకు ఎల్లారెడ్డి అటవీరేంజ్ అధికారి ఓంకార్స్పందించారు. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ అధికారి పర్వీన్‌తో కలిసి బోనాల్ శివారులో కోతమిషన్ల సాయంతోసుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో కూల్చివేతలకు గురైన టేకు చెట్లను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. చెట్ల కాస్ట్‌ను బాధ్యుల నుంచి రికవరీ చేస్తామని 'వెలుగు'తో చెప్పారు. అటవీ చట్టం ప్రకారం నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో 8 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. వీరందిరిపై త్వరలోనే కోర్టులోచార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.
అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం
చెట్ల నరికివేతపై విచారణకు వచ్చిన అధికారులపై బోనాల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నా పట్టించుకోలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. బోనాల్ మెంగారం గ్రామాల మధ్య మెయిన్ రోడ్డు పక్కన కొందరు గిరిజనులు చెట్లను నరికి వేస్తున్నారని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేంజ్ అధికారి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. రేంజ్ అధికారి వెంట బేస్‌క్యాంపు సిబ్బంది జీవన్, హరి ఉన్నారు.