దానాపూర్​లో పోడు గొడవ

దానాపూర్​లో పోడు గొడవ
  •     అటవీ అధికారుల అడ్డగింత

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ గ్రామంలో అటవీ అధికారులను పోడు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. 75 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. గ్రామస్తుంతా మూకుమ్మడిగా రోడ్డుకు అడ్డంగా నిలబడి అటవీ అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో పోడు రైతులు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.  తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  దీంతో ఫారెస్ట్ అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు.