కరీంనగర్ లో రాత్రి నుంచి అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. రెస్క్యూ టీం మొత్తం 12 గంటలుగా శ్రమించి రేకుర్తిలో పట్టుకున్నారు. మత్తు ఇంజెంక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఎలుగుబంటి దొరకడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆగస్టు 11 రాత్రి టైంలో బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఎలుగుబంటి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు.. భయంతో పరుగులు పెట్టారు. ద్వారకానగర్ లో కూడా ఎలుగు కనిపించిందని చెప్పారు స్థానికులు. ద్వారక నగర్ లో ఎలుగుబంటి సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో హల్చల్ చేసింది ఎలుగు. దీంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అటవీ శాఖ సిబ్బంది వలలతో ఎలుగును పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. చివరకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రేకుర్తిలో బంధించారు. కాసేపట్లో హైదరాబాద్ జూ పార్క్ కు తరలిస్తున్నట్లు చెప్పారు అధికారులు.