ఇల్లెందు, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను గురువారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇల్లెందు ఎఫ్డీఓ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమరారం రెంజ్ పరిధిలోని ఎల్లాపురం అటవీ ప్రాంతం నుంచి బోడు, టేకులపల్లి మీదుగా ఇల్లెందు గుండా ఖమ్మం పట్టణానికి అక్రమంగా కలపను తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో పోలీసులు మూడు టీమ్లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. మండలంలోని సుదిమళ్ల స్టేజీ వద్ద ఓ బొలోరో వాహనంలో తరలిస్తున్న రూ.1.08 లక్షల విలువైన 47టేకు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.