శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడలో ఆపరేషన్ చిరుతలో ట్విస్ట్.. అది పులి కాదు.. అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గత శనివారం అర్ధరాత్రి ఘన్సిమియాగూడ పరిసరాల్లో రెండు లేగ దూడలు, ఓ కుక్కపై చిరుత దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి శంకరపురం గ్రామంలోని ఐఎంటీ కాలేజీ సమీపంలో తిరుగుతుండగా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్అయింది.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సోమవారం ఐదు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అది చిరుత పులి కాదని గుర్తించారు. ట్రాప్ కెమెరాకు అడవి పిల్లి కదలికలు చిక్కాయి. కెమెరాలు రికార్డ్ అయిన దాని కదలికలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు.. ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది చిరుతపులి కాదని స్పష్టం చేశారు. ప్రజలు భయపడొద్దు.. అది చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అధికారులు చెప్పారు.