జూలూరుపాడులో అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్​ సీజ్

జూలూరుపాడులో అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్​ సీజ్

జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో అక్రమంగా జమాయిల్​ కలప తరలిస్తున్న ట్రాక్టర్​ను సీజ్​ చేసినట్లు ఫారెస్ట్​ అధికారులు తెలిపారు. పారెస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున  ఏన్కూరు మండల పరిధిలోని గంగుల నాచారం గ్రామ సమీపంలో జామాయిల్​ ప్లాంటేషన్​ నుంచి రూ.15వేల విలువైన కర్రలను జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్​పై తరలిస్తున్నట్లు అందిని ఇన్ఫర్మేషన్​తో ఫారెస్ట్​ సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. 

కలపను తరలిస్తున్న ట్రాక్టర్​ సీజ్​ చేసి ఫారెస్ట్ రేంజ్​ఆఫీస్​కు తరలించారు. పర్మిషన్​ లేకుండా అడవిలోని ఒక్క చెట్టును కొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్​ఓ ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మల్లయ్య, రహీం, నరింహరావు పాల్గొన్నారు.