కోతులకు ఆహారం వేసేందుకు స్టాళ్ల ఏర్పాటు

కోతులకు ఆహారం వేసేందుకు స్టాళ్ల ఏర్పాటు
  • స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ చర్యలు 

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: కోతులను అడవి బాట పట్టించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం నర్సాపూర్, శివ్వంపేట అటవీ ప్రాంతంలో ప్రయాణికులు రోడ్లపై ఆహారం వేయకుండా ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. నర్సాపూర్ అర్బన్ పార్క్ వద్ద ఒకటి, శివ్వంపేట మండలం చాకరి మెట్ల వద్ద ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. కోతులకు ఆహారం వేయదలచుకున్న వారు స్టాళ్లలోనే వేయాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.

కోతులు ఆహారం కోసం స్టాళ్ల లోకి రావడం మొదలు పెట్టాక క్రమ క్రమంగా స్టాళ్లను అడవి లోపలికి తరలిస్తామని చెప్పారు. మూడు నుంచి నాలుగేళ్లలో పెరిగే పండ్ల మొక్కలను అడవి మధ్యలో నాటి అవి పెరిగిన తర్వాత కోతులు రోడ్ల పైకి  రాకుండా అడవిలోనే ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి జోజి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పరమేశ్వరి తెలిపారు.