చెట్లను నరికితే చర్యలు : ఎఫ్ఆర్ఓ రవి కిరణ్

ములకలపల్లి, వెలుగు :  పోడు సాగు పేరుతో చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ తెలిపారు. శనివారం మండలంలోని గుండాలపాడు శివారు బండారు గుంపు గుత్తి కోయ ఆదివాసీలతో రేంజర్  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను పరిశీలించారు. ప్లాంటేషన్ ​ఏర్పాటుకు గల భూమి లభ్యత గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 100 హెక్టార్లలో ఈ సంవత్సరం ప్లాంటేషన్ సాగు చేయాల్సి ఉండగా ఈ ప్రాంతంలో సుమారుగా 50 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకొని సాగుకు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా మండలంలో ఉన్న అటవీ భూముల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీల తరఫున సామాజిక కార్యకర్త క్రాంతి రేంజర్ కు విన్నవించారు. ఆయన వెంట ఎఫ్ ఎస్ ఓ నీలమయ్య, ఎఫ్ బీ ఓ లు వెంకన్న, భాస్కర్​ ఉన్నారు.