- ఖమ్మం జిల్లాలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొడుకును చూసేందుకు వెళ్లిన ఫారెస్ట్సెక్షన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్‌లో సీహెచ్సురేశ్(44) ఫారెస్ట్సెక్షన్ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ.. ఇటీవలి ప్రమోషన్‌పై భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం డివిజన్‌కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తన కొడుకును చూసేందుకు ఆదివారం సురేశ్కారులో వెళ్లాడు. ఖమ్మంలో ఉండే బంధువుల ఇంటికి కొడుకుతో పాటు వెళ్లి కొంత సేపు ఉన్నాడు.
అక్కడ ఇంట్లో మెట్లు ఎక్కుతూ అతడు అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని సొంతూరు కారేపల్లి మండలం సూర్యాతండాకు సోమవారం తరలించారు. డీఎఫ్ఓ కృష్టాగౌడ్తో పాటు ఆఫీస్ సూపరింటెండెంట్ మూర్తి, ఆఫీసర్లు, సిబ్బంది సంతాపం తెలిపారు.