గుండెపోటుతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి

తాడ్వాయి, వెలుగు : గుండెపోటుతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  అటవీశాఖలో కాటాపూర్ ఏరియా సెక్షన్ ఆఫీసర్ గా వజ్జ లక్ష్మీనరసయ్య (61) విధులు నిర్వహిస్తుండగా.. తాడ్వాయిలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా ఉన్నత చదువుల కోసం హనుమకొండలో ఉంటున్నారు. లక్ష్మి స్థానిక ఆశ్రమ బాలికల పాఠశాలలో వార్డెన్. కాగా..  శుక్రవారం ఒక శుభకార్యం ఉండగా భార్య వెళ్లిపోగా.. ఇంట్లో లక్ష్మీ నరసయ్య బాత్రూమ్ లో  స్నానం చేస్తున్నాడు. 

ఒక్కసారిగా స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపడిపోయాడు.  భార్య ఇంటికి వచ్చి చూడగా  భర్త కనిపించలేదు. దీంతో వెతుకుతూ బాత్రూమ్ వద్దకు వెళ్లి చూసింది.  పిలిస్తే పలకలేదు. దీంతో లోపల భర్త విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులను పిలిచి బాత్రూమ్ డోర్ ను పగలకొట్టి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే లక్ష్మీనరసయ్య మృతి చెందినట్టు తెలిపారు. అతను మరో నాలుగు నెలల్లో రిటైర్ అవుతారు. ఫారెస్ట్ ఆఫీసర్ మృతితో తాడ్వాయిలో విషాదం నెలకొంది.