
దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 7.14 లక్షల చదరపు కి.మీ. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71శాతం. దీనికి చెట్లతో కూడుకున్న ప్రాంతాన్ని కూడా కలిపితే 8,09,537 చ.కి.మి.లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62శాతం. ఐఎఫ్ఎస్ఆర్ 2019తో పోలిస్తే ఐఎఫ్ఎస్ఆర్ 2021లో అడవులు 1540 చ.కి.మి.(0.22శాతం) చెట్లు 721 చ.కి.మి. (0.76శాతం), అడవులు, చెట్లు కలిపి 2,261 చ.కి.మి. (0.28శాతం) పెరిగాయి.
అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మి.), తెలంగాణ (632 చ.కి.మి.), ఒడిశా (537 చ.కి.మి.), కర్ణాటక (155 చ.కి.మి.), జార్ఖండ్ (110 చ.కి.మి.) రాష్ట్రాల్లో పెరిగాయి. కొండ ప్రాంత జిల్లాల్లో ఆ జిల్లాల భౌగోళిక విస్తీర్ణంలో 40.17శాతం అడవులు ఉన్నాయి.