- ఒక ప్రాంత భౌగోళిక అటవీ విస్తీర్ణంలో 70శాతం పచ్చదనం ఉంటే వాటిని అత్యంత దట్టమైన అడవులుగా గుర్తిస్తారు.
- దేశంలో అటవీ సాంద్రత అధికంగా కలిగి రాష్ట్రం మిజోరాం.
- అటవీ సాంద్రత అత్యధికంగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు.
- దేశంలో అటవీ పెరుగుదలలో మొదటి మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా.
- తెలంగాణ తలసరి అటవీ విస్తీర్ణం 0.08 హెక్టార్లు.
- అంతరించిపోయే దశలో ఉన్న కలివికోడి ఇటీవల కాలంలో ఆదిలాబాద్ అడవుల్లో కనిపించింది.
- రాష్ట్రంలో నమోదిత అటవీ ప్రాంతాల విస్తీర్ణం 27,688 చ.కి.మీ.
- తెలంగాణ రాష్ట్రంలో మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించిన అమీన్పూర్ చెరువును 2016లో గుర్తించారు.
- తెలంగాణలో అత్యంత నాణ్యమైన టేకు చెట్లు భద్రాచలం, పాల్వంచ, జన్నారం అటవీ ప్రాంతంలో లభిస్తాయి.
- డీగ్రేడ్ అడవులు అధికంగా కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.
- ప్రపంచంలో అత్యంత నాణ్యత కలిగిన టేకు లభించే దేశం మయన్మార్.
- రాజ్యాంగంలోని 51వ ఆర్టికల్ వన్యప్రాణి సంరక్షణ ఒక ప్రాథమిక విధి అని తెలియజేస్తుంది.
- ఫరహాబాద్ పులుల కేంద్రం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది.
- తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే జపాన్‌లో అనుసరించే మియవాకీ పద్ధతిని ఆరో విడత హరితహారం నుంచి ప్రారంభించారు.
- తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయాన్ని ములుగులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
- తెలంగాణకు హరితహారంలో భాగంగా పొలం గట్లపై టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సబాబుల్ మొక్కలను నాటుతారు.
- దేశంలో మొట్టమొదటి అటవీ గణన 1987లో జరిగింది.
- ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1985 వ సంవత్సరంలో ఏర్పడింది.
- ఉష్ణమండల అడవుల పరిశోధనా కేంద్రం జబల్పూర్లో ఏర్పాటు చేశారు.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరిడ్జోన్ ఫారెస్ట్ రీసెర్చ్ జోధ్‌పూర్‌లో ఉంది.
- ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఉంది.
- సమశీతోష్ణ సతత హరిత అరణ్యాల పరిశోధనా సంస్థ సిమ్లాలో ఉంది.
- టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని గుర్రపుడెక్క లేదా బుడగ తామరను పిలుస్తారు.
- భారతదేశంలోని అడవుల్లో అధికంగా సాల్ వృక్షాలు పెరుగుతాయి.
- ఎయిర్ కూలర్ ప్యాడ్స్ తయారీలో కుష్కుష్ గడ్డి జాతిని ఉపయోగిస్తారు.
- మంచి గంధం అధికంగా కర్ణాటక రాష్ట్రంలో లభిస్తుంది.
- వ్యవసాయ భూముల్లో పంటలతోపాటు వృక్షాల పెంపకాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఆగ్రోఫారెస్ట్ అంటారు.
- దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
- సిగరెట్ పెట్టెల తయారీలో ఉపయోగించే కలప హల్దా.
- చిప్కో ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ప్రారంభమైంది.
- 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను రాష్ట్ర జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. రికార్డెడ్ ఫారెస్ట్ కవర్ అంటే చట్టం చేత నిర్ధారించబడని అడవుల్లోని చెట్ల సంఖ్యను తెలియజేస్తుంది.
- అడవులను కారుచిచ్చు నుంచి రక్షించుకునేందుకు ప్రవేశ పెట్టిన సాఫ్ట్వేర్ ఫారెస్ట్ అలార్మింగ్ జనరేటింగ్ సిస్టం.
- ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం పదో స్థానంలో ఉంది.
- అగ్గిపెట్టెల తయారీలో సిల్వర్ ఫిర్ కలపను ఉపయోగిస్తారు.
- సారా తయారీకి ఉపయోగించే విప్ప పువ్వు అమ్రాబాద్ ప్రాంతంలో అధికంగా లభిస్తుంది.
- లక్కను అధికంగా అందించే రాష్ట్రం జార్ఖండ్.