ముంబై: ఈ నెల 23తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 7.023 బిలియన్ డాలర్లు పెరిగి 681.688 బిలియన్ డాలర్ల కొత్త గరిష్టాన్ని తాకినట్లు ఆర్బీఐ తెలిపింది. గత రిపోర్టింగ్ వారంలో మొత్తం నిల్వలు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 2 నాటికి మొత్తం నిల్వల కోసం మునుపటి ఆల్ టైమ్ గరిష్టం 674.919 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఆగస్టు 23తో ముగిసిన వారానికి, రిజర్వుల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 5.983 బిలియన్ డాలర్లు పెరిగి 597.552 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వారంలో బంగారం నిల్వలు 893 మిలియన్ డాలర్లు పెరిగి 60.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ118 మిలియన్లు పెరిగి 18.459 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిపోర్టింగ్ వారంలో ఐఎంఎఫ్‌లో భారతదేశం రిజర్వ్ స్థానం 30 మిలియన్లు పెరిగి 4.68 బిలియన్ డాలర్లకు చేరుకుంది.