జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ
ఆర్ఐ విచారణలో వెల్లడి
లింగంపేట, వెలుగు: కల్యాణలక్ష్మి డబ్బులకు కక్కుర్తిపడ్డ ఓ వ్యక్తి జీపీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మండలంలోని పర్మల్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణ జరపగా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బయటపడిందని ఆర్ఐ బాలయ్య చెప్పారు. గ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్గతేడాది జూలైలో తన కూతురు పెండ్లి చేశాడు. కల్యాణలక్ష్మి ఫైల్‌పై సంతకం చేయాలని సెప్టెంబర్‌లో జీపీ సెక్రటరీ శ్వేత వద్దకు వెళ్లాడు.పెండ్లి కూతురు మైనర్ కావడంతో సంతకం చేయనని ఆమె తేల్చి చెప్పారు. శ్రీనివాస్ గ్రామానికి చెందిన మరికొందరి సాయంతో సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, మిగతా సర్టిఫికెట్లను జత చేసి ఫైల్రెడీ చేశాడు. గెజిటెడ్సంతకం కోసం ఎంపీడీవో వద్దకు వెళ్లగా, ఆయన పరిశీలించకుండానే సంతకాలు చేశాడు.ఆ ఫైల్‌ను రెవెన్యూ ఆఫీస్‌లో అందజేయగా ఆర్ఐ విచారణ చేశారు. జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. రావుల శ్రీనివాస్, అతడికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్చారిలకు జీపీ సెక్రటరీ శ్వేత కంప్లైంట్చేశారు.