గుంపులో ఉన్నా దొంగను పట్టేస్తుంది :  సీసీ కెమెరాను మించిన కొత్త టెక్నాలజీ

గుంపులో ఉన్నా దొంగను పట్టేస్తుంది :  సీసీ కెమెరాను మించిన కొత్త టెక్నాలజీ

నేర పరిశోధన, నిందితులు- దొంగలను పట్టివ్వడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకం. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు వచ్చాక… నేరస్తుల గుట్టు తెల్సుకోవడం ఈజీ అయిపోయింది. నేరాలు తగ్గాయని కాదుగానీ.. వాటిని పరిశోధించడంలో మాత్రం సీసీ కెమెరాలు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే.. సీసీ కెమెరాల్లోనూ కొన్ని డిజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సీసీ ఫుటేజ్ లో ముఖం కనిపిస్తే కానీ.. వ్యక్తులను గుర్తుపట్టడం కష్టం. అందుకే చైనాకు చెందిన ఓ కంపెనీ కొత్త టెక్నాలజీ కనిపెట్టింది. సీసీ ఫుటేజ్ ఉందని ముఖాలకు మాస్కులు కట్టుకుని కొందరు దొంగలు తమ పనికానిచ్చేస్తుంటారు. కానీ.. ఈ కొత్త టెక్నాలజీ ముందు అలాంటి వాళ్ల పప్పులు ఉడకవు. ఈ కొత్త టెక్నాలజీ ముందు ఎన్ని కుప్పిగంతులేసినా దొరికిపోవడం ఖాయం. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా దీని ముందు దిగదుడుపే.

చైనాలోని బీజింగ్ లో ఓ కంపెనీ ఉంది. దాని పేరు వాట్రిక్స్. ఈ సంస్థ ‘గెయిట్ రికగ్నిషన్’ అనే సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ఈ సాఫ్ట్ వేర్ తో కంపెనీ సరికొత్త సర్వైలెన్స్ పరికరాన్ని కనిపెట్టింది. ఓ వ్యక్తి నడిచినా, కదిలినా… సరే .. అతనెవరో సిస్టమ్ కనిపెట్టేస్తుంది. ఆ బాడీ లాంగ్వేజ్ ను.. తన దగ్గరున్న డేటా బేస్ లో చెక్ చేసి.. ఎవరిదో చెప్పేస్తుంది. ముందుగా వీడియోలోని వ్యక్తి కదలికలను బ్లాక్ అండ్ వైట్ లో రిజిస్టర్ చేసుకుంటుంది. అదే వ్యక్తి ఎంత ట్రాఫిక్ లో నడుచుకుంటూ వెళ్తున్నా.. లేదా పరుగెడుతున్నా… అతడిని అతడి బాడీ మూమెంట్స్ ను బట్టి గుర్తు పట్టేస్తుంది.

లక్ష వరకు లైవ్ వీడియోలను వేగంగా విశ్లేషించి… గెయిట్ రికగ్నిషన్ పరికరం సమాచారం ఇవ్వగలదని కంపెనీ సీఈఓ హువాంగ్ యాంగ్ జెన్ చెప్పారు. మ్యాగ్జిమమ్ 96శాతం కచ్చితమైన సమాచారం అందిస్తుందన్నారు.  బీజింగ్, షాంఘై పోలీసులు నిందితులను గుర్తించేందుకు ఈ సాఫ్ట్ వేర్ ను ఇప్పటికే వాడుతున్నారు.

 

 

Chinese tech can recognise your walk

Who needs facial recognition? China now has technology to recognise you by the way you walk.

South China Morning Post 发布于 2019年2月25日周一