ఆ ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు ఎంతో గర్వించింది. అల్లారుముద్దుగా సాకింది. పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్దులు చెప్పించింది. వారికి మంచి బతుకునిచ్చింది.. కానీ తన జీవిత చివరి రోజుల్లో ఇలా కనీసం తిండి పెట్టకుండా హింసిస్తారని మాత్రం ఊహించలేదు..పండు ముసలి.. తిండికి లేదని కాదు.. కోట్లలో ఆస్తులు న్నాయి.. అయినా కన్న తల్లికి బుక్కెడు బువ్వ పెట్టేందు ఆ కొడుకులకు చేతులు రావడంలేదు.. కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నాడు.. ఆస్తుల వివాదంతో కని, పెంచి న తల్లికి తిండిపెడ్డకుండా రోడ్డున పడేశారు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్ల నర్సమ్మ ‘‘బుక్కెడు బువ్వ పెట్టించండి నాయ నా’’ అని ఆర్డీవో ను వేడుకుంటున్న దృశ్యాలు చూసేవారిని కంట తడి పెట్టించాయి..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్ల నర్సమ్మకు ఇద్దరు కొడుకులు..ఇద్దరు బిడ్డలు.. నర్సమ్మకు కోట్ల విలువ చేసే 8 ఎకరాల భూమి ఉంది.. అయితే తన ఇద్దరు కొడుకులు, కోడళ్లు ఆస్తిని వారి పేరున రాయించుకుని..తిండిపెట్టకుండా తనను రోడ్డున పడేశారని ఆవేదన చెందుతోంది. తనకు న్యా యం చేయాలని జగిత్యాల ఆర్డివో కు ఫిర్యాదు చేసింది. బుక్కెడు బువ్వ పెట్టించండి నాయనా అంటూ కంట నీరు పెడుతోంది. స్పందించిన ఆర్డీవో నర్సమ్మ కుమా రులకు నోటీసులిచ్చి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. టెక్ యుగంలో కూడా ఇలాంటి కొడుకులు ఉన్నారా అని ఈ విషయం తెలిసిన వారందరూ ఆశ్చర్య పోతున్నారు.