గులాబీమయమైన నది.. క్యూ కడుతున్న టూరిస్టులు

గులాబీమయమైన నది.. క్యూ కడుతున్న టూరిస్టులు

ఓ నది గులాబీమయంగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పింక్ కలర్ లో ఉన్న ఈ నదిని చూడటానికి చాలా మంది పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇక్కడకు వచ్చిన వారు ఫొటోలు..సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఇది ఆకర్షించింది. ఈ మేరకు ఆయన ఫొటోలను షేర్ చేశారు. గ్రామానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, ఫొటోలు చూస్తుంటే.. ఎంతో ఉత్సాహం.. ఆహ్లాదం కలుగుతోందని ట్వీట్ లో తెలిపారు.

స్క్రీన్ సేవర్ గా సేవ్ చేసుకున్నట్లు... River of Hope అంటూ కామెంట్ చేశారాయన. కేరళ రాష్ట్రంలోని కోజికూడ్ జిల్లాలో Avala Pandi గ్రామంలో ఓ నది ఉంది. ఆ నీటిలో forked fanwort పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు గులాబీ కలర్ లో ఉంటాయి. దీంతో నది మొత్తం గులాబీ మయంగా మారిపోతుంది. ఈ పింక్ నది ఫొటోలు 2020లో వైరలైన సంగతి తెలిసిందే. అలాగే షిల్లాంగ్ రాజధాని మేఘాలయలోనూ ఈ పువ్వుల అద్భుతం కనిపించింది.