కలెక్టర్లకు పీఆర్ డైరెక్టర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)ల పనితీరును అంచనా వేసేందుకు జిల్లా స్థాయి పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను పీఆర్ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్లు జారీచేశారు. ఇప్పటికే జేపీఎస్‌ల పనితీరును లెక్క కట్టడానికి గైడ్ లైన్స్ ఇచ్చామని, ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జేపీఎస్‌ల పనితీరును అంచనా వేయడానికి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయి అధికారి, డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల ఆదేశించారు. 8 అంశాలకు 100 మార్కులు ఇచ్చి, మరో 60 అంశాల ఫార్మాట్‌ను నింపి అధికారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.