పంజాబ్ వేర్పాటువాదులకు కేజ్రీ మద్దతుదారుడు

పంజాబ్ వేర్పాటువాదులకు కేజ్రీ మద్దతుదారుడు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నెల 20న ఒకే దశలో పోలింగ్ జరనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య  ముక్కోణపు పోటీ నెలకొంది. ఇప్పటికే ప్రచారం తుది దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో మైకులన్నీ మూగబోనున్నాయి. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై ఆ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్ ను ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకు కేజ్రీవాల్ మద్దతుదారుడని ఆయన అన్నారు. ‘భవిష్యత్తులో ఒక రోజు నేను పంజాబ్ కు ముఖ్యమంత్రిని అవుతా లేదా స్వతంత్ర (ఖలిస్థాన్) దేశానికి తొలి ప్రధాని అవుతా’ అని కేజ్రీవాల్ చెప్పారని విశ్వాస్ తెలిపారు. తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ తనతో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. పాకిస్థాన్ తో సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్ రాష్ట్రం విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మరిన్ని వార్తల కోసం..

రేవంత్ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు

టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పులపాలు

మద్యం ఆదాయంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తుండు