ప్రజలకు అండగా ఉంటా : జోగు రామన్న

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అండగా ఉంటానని ఆదిలాబాద్​ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ​పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండి, వారి రుణం తీర్చుకుంటానన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్ ​శంకర్​కు చిత్తశుద్ధి ఉంటే  బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే మళ్లీ కొబ్బరికాయలు కొట్టకుండా.. స్వతహాగా నిధులు తెప్పించుకొని కొత్త పనులు చేపట్టాలన్నారు. ప్రజా తీర్పుని పూర్తిగా గౌరవిస్తూ వారితోనే కలిసి నడుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్​రంజాని, లీడర్లు అజయ్, బండారి సతీశ్, మెట్టు ప్రహల్లాద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.