ఆదిలాబాద్ మాజీఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని తన ఇంట్లో ఇవాళ (జూన్ 29) ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇచ్చోడ సమీపంలో రమేశ్ రాథోడ్ కన్నుమూశారు.
రమేశ్ రాథోడ్ మృతదేహాన్ని స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. జూన్ 30న రమేష్ రాథోడ్ అంత్యక్రియలు తన స్వగ్రామంలో జరగనున్నాయి.
రమేశ్ రాథోడ్ 1999 నుంచి 2004 వరకు ఖనాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. 2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. రమేశ్ రాథోడ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.