కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషించి రైతుల ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రేవంత్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విఫలమైందన్నారు.  కేసీఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. 

పైలట్ ప్రాజెక్టుగా చెప్పి మండలంలో ఒక్క ఊరిలో మాత్రమే డబ్బులు జమ చేయడం.. ఒక్క కోడిని  కోసి ఊరంతా పంచినట్లుంది ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, రసమయి బాలకిషన్, జడ్పీ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి పాల్గొన్నారు..

బాధిత కుటుంబానికి మీరు ఏం జేస్తరు నిరంజన్ రెడ్డిని ప్రశ్నించిన రైతు

‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు.. రైతులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసిన్రు... అప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు మీరెంజేసిన్రు’.. అని మాజీ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని మహేశ్‌‌‌‌‌‌‌‌ అనే రైతు నిలదీశాడు. అక్కడే ఉన్న విద్యాసాగర్ రావు అడ్డుకోవడానికి ప్రయత్నించగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జేసిన్రో బరాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడుగుతా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పిట్టల లింగన్న కుటుంబానికి ఏం జేస్తరో ఇక్కడే అందరి ముందు ప్రకటించాలని కోరాడు. దీంతో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.