గుండెపోటుతో ఏఎంసీ మాజీ డైరెక్టర్​మృతి

గుండెపోటుతో ఏఎంసీ మాజీ డైరెక్టర్​మృతి

దహెగాం, వెలుగు : మండలంలోని ఒడ్డుగూడకు చెందిన కాగజ్​నగర్​మార్కెట్​కమిటీ మాజీ డైరెక్టర్​మహమ్మద్​నజీర్​(35) గుండె పోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. నజీర్​ గతంలో బీఆర్ఎస్​ మండల యూత్​ ప్రెసిడెంట్​గా వ్యవహరించాడు. 

మృతుడికి 24 రోజుల క్రితం పాప పుట్టింది. నామకరణానికి ఏర్పాట్లు చేస్తుండగా హఠాన్మరణంతో ఆ ఇంట్లో విషాద షాయలు అలుముకున్నాయి. నజీర్​ పార్థీవదేహానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు నివాళులు అర్పించారు.